‘బిగ్ బాస్ 9’ లో కామన్ మెన్ ఎంట్రీ సెలక్షన్ కోసం ‘అగ్నిపరీక్ష’ అనే కాంటెస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన అభిజీత్,బిందు మాధవి, నవదీప్ వంటి వారు జడ్జిలు గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు గ్రీన్ కార్డు చూపిస్తే వాళ్ళు హౌస్లోకి వెళ్లేందుకు అర్హులు అని అర్థం. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోస్ చూస్తుంటే మాస్క్ మ్యాన్ హృదయ్, యాంకర్ మల్లీశ్వరి, ఉత్తర ప్రశాంత్, రవి, కల్కి, ప్రసన్న కుమార్, నర్సయ్య, సిద్ధిపేట మోడల్, దమ్ము శ్రీజ, ఊర్మిళ చౌహాన్, డీమన్ పవన్, అనూష రత్నం, శ్వేత శెట్టి, వెజ్ ఫ్రైడ్ మోమో, ప్రియా శెట్టి, కేతమ్మ వంటి వాళ్ళు పాల్గొన్నారు.
వీరిలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్, పెద్దావిడ కేతమ్మ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు అని చెప్పాలి. మాస్క్ మ్యాన్ హృదయ్ కి బిందుమాధవి లూజర్ ట్యాగ్ ఇచ్చి ఎలిమినేట్ చేసినట్టు ప్రోమో వదిలారు. మరోపక్క ప్రసన్న కుమార్, కేతమ్మ స్టోరీస్ ఇన్స్పైరింగ్ గా అనిపిస్తున్నాయి.
ప్రసన్న కుమార్ ఫోటోగ్రాఫర్ గా, ట్రావెలర్ గా, లెక్చరర్ గా, జావెలిన్ త్రో స్టేట్ ప్లేయర్ గా, బాడీ బిల్డర్ గా, బైక్ రైడర్ గా తన టాలెంట్ చూపించినట్టు తెలుస్తుంది. నిలబడటమే కష్టమన్న అతను మారథాన్‌లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుని ఎంతో మందికి మాదిరిగా నిలిచినట్టు తెలుస్తుంది. ‘నీ కథ ప్రపంచానికి తెలియజేయకపోతే మాకు నిద్ర పట్టదు’ అంటూ జడ్జ్ నవదీప్ చెప్పడంతో ఇతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంతా భావిస్తున్నారు. అలాగే కేతమ్మ తన భర్తకు పక్షవాతం వచ్చిందని, అతన్ని ఈమెను తన చిన్న బిడ్డ సాకుతుందని చెప్పి అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఈ క్రమంలో జడ్జి అభిజీత్ ‘మీరు చూసినంత జీవితం నేను చూడలేదు కానీ.. ఆట నేను ఆడి చూశాను. చాలా కష్టంగా ఉంటుంది’ అంటూ ఆమెతో చెప్పాడు. అందుకు కేతమ్మ.. ‘నాకు తోచినంత ఆడతా సార్, మీరు 10మందిని కొట్టుకొస్తే.. నేను ఒక్కరినైనా కొట్టుకొస్తా’ అంటూ చాలా ఉత్సాహంగా సమాధానం ఇచ్చింది. ఆమె జోష్ చూసి అంతా ఇంప్రెస్ అయిపోయారు. ఆమె కూడా హౌస్ లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి. ఏమవుతుందో.