సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళం ‘ప్రేమలు’ సినిమాలో ఈమె పోషించిన మలార్ పాత్రకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో అయితే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె రేంజ్ పెరుగుతూనే వచ్చింది.
ఇదిలా ఉంటే.. సాయి పల్లవికి ఫేవరెట్ హీరో కూడా ఓ టాలీవుడ్ స్టార్ అట. కానీ అతని సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం ఈమె నో చెప్పింది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అవును ఓ సందర్భంలో సాయి పల్లవి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. చిరంజీవి నటన, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా డాన్స్ అంటే సాయి పల్లవికి ఇష్టమట. కానీ చిరంజీవి సినిమాలో ఈమెకు ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది.
అది ఏ సినిమానో చాలా మందికి తెలిసే ఉంటుంది. అవును మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పింది. దీంతో కీర్తి సురేష్ ను చెల్లెలి పాత్రకి తీసుకున్నారు.
‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆ టైంలో ‘నా సినిమాలో చెల్లెలి పాత్రని సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ నాకు సంతోషమే. ఎందుకంటే నా పక్కన తను హీరోయిన్ గా చేయాలని ఆశపడుతున్నాను. సాయి పల్లవి తో కలిసి డాన్స్ చేయాలనేది నా కోరిక’ అంటూ చిరు చెప్పడం జరిగింది.