Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- April 4, 2026 / 12:12 AM ISTByPhani Kumar
వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్… ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు ‘బైకర్’ గా(Biker) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇండియాలో రూపొందిన ఫస్ట్ మోటో క్రాస్ మూవీ ఇది.
Biker
అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ తండ్రి పాత్ర పోషించడం విశేషం. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

శర్వానంద్ గత సినిమా హిట్ అవ్వడంతో ‘బైకర్’ కి కూడా ధియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. వాటి వివరాలతో పాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :
| తెలంగాణ | 7 cr |
| సీడెడ్ | 2 cr |
| ఆంధ్ర(టోటల్) | 7 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 16 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 4 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 20 cr |
‘బైకర్’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే పెద్దదే. కానీ ‘నారీ నారీ నడుమ మురారి’ హిట్ అవ్వడంతో… ‘బైకర్’ బిజినెస్ కి బాగా హెల్ప్ అయ్యింది అని చెప్పాలి. కాకపోతే స్ట్రాంగ్ పాజిటివ్ మౌత్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?













