నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై నిర్మించాడు.
టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని అందరిలోనూ రెట్టింపు చేశాయి. అందుకు తగ్గట్టే మొదటి రోజు ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. 4వ వారం కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది.నిన్న 29వ రోజున కూడా ఇక్కడ ‘లైగర్’ కంటే ఎక్కువగా కలెక్ట్ చేయడం విశేషం. ఒకసారి 29 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 11.65 cr |
సీడెడ్ | 7.94 cr |
ఉత్తరాంధ్ర | 4.85 cr |
ఈస్ట్ | 2.00 cr |
వెస్ట్ | 1.48 cr |
గుంటూరు | 2.25 cr |
కృష్ణా | 1.61 cr |
నెల్లూరు | 0.95 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 32.73 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.31 cr |
ఓవర్సీస్ | 2.38 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 37.42 cr |
‘బింబిసార’ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.29 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.37.42 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడమే కాకుండా ఇప్పటివరకు బయ్యర్లకు రూ.21.42 కోట్ల లాభాలను అందించింది.
కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా రూ.37 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించి రికార్డ్ క్రియేట్ చేసింది.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర