Bimbisara: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో బింబిసార సెంటిమెంట్.. ఏమైందంటే?

  • August 21, 2023 / 10:02 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. భోళా శంకర్ ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో భవిష్యత్తులో స్ట్రెయిట్ ప్రాజెక్ట్ లలో ఎక్కువగా నటించాలని మెగాస్టార్ భావిస్తున్నారు. అయితే చిరంజీవి కొత్త సినిమాలలో ఒక సినిమాకు బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకుడు కాగా చిరంజీవి సినిమాలో కూడా పాప సెంటిమెంట్ ఉండనుందని సమాచారం అందుతోంది. జగదేకవీరుడు అతిలోక సుందరి తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో ఎక్కువమంది హీరోయిన్లకు స్కోప్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి 151వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

యూవీ సంస్థ ప్రభాస్ తో కాకుండా స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం. యూవీ సంస్థ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన స్థాయిని మరింత పెంచే సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు చిరంజీవి మార్కెట్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

చిరంజీవి పారితోషికం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం చిరంజీవి పారితోషికం పెరగడంతో పాటు ఇతర భాషల్లో కూడా మెగాస్టార్ కు పాపులారిటీ పెరగనుంది. చిరంజీవి రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సాధించి బాక్సాఫీస్ వద్ద తన పేరు మారుమ్రోగేలా చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus