మొత్తానికి సత్తినే క్లారిటీ ఇచ్చేసాడు.. అసలు మేటర్ అది..!

చేవేళ్ల రవి అంటే పెద్దగా ఎవ్వరికీ తెలీకపోవచ్చు కానీ.. ‘బిత్తిరి సత్తి’ అంటే మాత్రమే అందరికీ సుపరిచితమే.! ‘వి6’ లో వచ్చే ‘తీన్మార్’ ప్రోగ్రామ్ లో తెలంగాణ స్టైల్ లో అదిరిపోయే పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను అలరించేవాడు మన సత్తి. అంతకు ముందు ఓ ఛానల్ లో పనిచేసినప్పటికీ.. ‘తీన్మార్’ న్యూస్ ప్రోగ్రామ్ ద్వారానే ఓ స్టార్ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తర్వాత ‘వి6’ నుండీ సడెన్ గా ‘టీవీ9’ లో దర్శనమిచ్చాడు.

ఆ ఛానల్ లో ‘ఇస్మార్ట్ న్యూస్’ అనే ప్రోగ్రాం ను మొదలుపెట్టి.. అక్కడ కూడా అదే జోరు చూపించాడు కానీ.. ఆ ప్రోగ్రాం ఎందుకో అంత సక్సెస్ కాలేదు. ఇదిలా ఉండగా.. అక్కడి యాజమాన్యంతో ఓ షో విషయంలో సత్తికి మనస్పర్థలు వచ్చి రిజైన్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ‘బిగ్ బాస్4’ లో సత్తి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా టాక్ నడిచింది. మొత్తానికి ఆ ప్రచారం అంతటికీ సత్తి క్లారిటీ ఇచ్చేసాడు. త్వరలో బిత్తిరి సత్తి.. ‘సాక్షి’ ఛానల్ లో జాయిన్ కాబోతున్నాడట.

ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పుకొచ్చాడు. ‘వై.యస్.జగన్మోహన్ రెడ్డి సతీమణి వై.యస్.భారతి సహాకారంతో ‘సాక్షి’ లో తన కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నానని.. అది చాలా బాగుంటుందని’ సత్తి తెలిపాడు. అంతేకాదు అందుకు సంబందించిన ఓ ప్రోమో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వీటిని బట్టి చూస్తే ‘బిగ్ బాస్4’ లో సత్తి లేనట్టే అని కన్ఫార్మ్ అవుతుంది.


15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus