Parineeti Chopra: భారీగానే సంపాదించిన నటి పరిమితి చోప్రా.. ఆస్తులు విలువ ఎంతంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పరిణితి చోప్రా ఒకరు. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీ స్థాయిలోనే ఆస్తులను పోగు చేశారు. ఇలా నటిగా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకునేవారు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో జన్మించినటువంటి పరిణితి చోప్రా నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఒకో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకునే ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగా ఆస్తులు కూడా పెట్టారని చెప్పాలి. ఇక తాజాగా నటి పరిణితి చోప్రా ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక వీరి పెళ్లి ఫోటోలను కూడా పరిణితి (Parineeti Chopra) సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆస్తులు విలువ గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ సుమారు 60 కోట్ల వరకు నికర ఆస్తులను కూడ పెట్టారని తెలుస్తుంది. ఇక ముంబైలో సముద్రపు వ్యూ వండే విధంగా ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారు.

ఈ ఫ్లాట్ విలువ సుమారు 22 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. వీటితోపాటు తన గ్యారేజ్ లో ఖరీదైన ఆడి A6, జాగ్వార్ XJL మరియు ఆడి Q5 వంటి హై-ఎండ్ కార్లను కొనుగోలు చేశారట. ఈ కార్ల విలువ కూడా సుమారు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయని తెలుస్తోంది. ఇలా నటిగా కొనసాగుతూనే ఈమె ఈ స్థాయిలో ఆస్తులు కూడా పెట్టారన్న విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus