ప్రభాస్ బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈయన పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ వరుసగా బాలీవుడ్ తారలతో జోడి కడుతున్నారు. నార్త్ లో వారికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సినీ నిర్మాతలు సైతం బాలీవుడ్ హీరోయిన్లను రంగంలోకి దింపుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్, జాక్వెలిన్ ఫెర్నండేజ్, ప్రాజెక్టుకే సినిమాలలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇకపోతే ప్రభాస్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన మరోసారి బాలీవుడ్ హీరోయిన్ జతకట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఓవర్సీస్ క్రిటిక్స్ ఉమైర్ సందు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉమైర్ సందు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బెబో కరీనా ఫైనల్ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇకపోతే ఈ సినిమా కోసం కరీనా కపూర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం కరీనాకపూర్ ఏకంగా 17 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక ఈమె ఈ రేంజ్ లో డిమాండ్ చేయడంతో చిత్ర బృందం కూడా అదే రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా స్పిరిట్ సినిమా కోసం కరీనా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలబడునున్నట్లు సమాచారం.