నటనకు భాషా బేధం లేదు. పాత్రకు తగ్గ న్యాయం చేస్తే ప్రేక్షకుడు నటీనటుల్ని తమవారిగా భావిస్తారు. అలా తమ అందం, అభినయంతో బాలీవుడ్ భామలు తెలుగు చిత్రాల్లో నటించి అభినందనలు అందుకున్నారు. తెలుగు వారిని అలరించిన బాలీవుడ్ హీరోయిన్స్ పై ఫోకస్…
కాజల్ అగర్వాల్టాలీవుడ్ యువరాణిగా ముద్ర వేసుకున్న కాజల్ అగార్వల్ తొలి సారి హిందీలో “క్యూన్ హో గయా నా” చిత్రంలో వివేక్ ఒబెరాయ్ సరసన నటించింది. ఆ తర్వాత తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో అడుగుపెట్టి అందరి మనసులు గెలుచుకుంది.
తమన్నా భాటియామిల్క్ బ్యూటీ తమన్నా “చాంద్ సా రోషన్ చెహ్రా( 2005 )” అనే హిందీ చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరం “శ్రీ” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ అయింది.
జెనీలియా డిసౌజాబబ్లీ బ్యూటీ జెనీలియా డిసౌజా తుఝే మేరీ కసం (2003 ) అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రవేశించింది. అదే సంవత్సరం తెలుగులో సత్యం సినిమాతో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ కావడంతో తెలుగులో అనేక చిత్రాలు చేసింది.
సోనాలి బింద్రేహిందీలో దాదాపు 30 సినిమాలు చేసిన తర్వాత సోనాలి బింద్రే తెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు మురారి సినిమాతో వచ్చి తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది.
అమీషా పటేల్“కహో నా ప్యార్ హాయ్” అనే సినిమాతో అమీషా పటేల్ బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో తెలుగులో ప్రవేశించింది. 2000 లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయి రెండు పరిశ్రమల్లో భారీ అవకాశాలను తెచ్చి పెట్టాయి.
బిపాషా బసుఅజ్నాబీ (2001 ) అనే హిందీ మూవీలో హీరోయిన్ గా తొలి అవకాశం అందుకున్న బిబాసా బసు.. టక్కరి దొంగ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ కాకపోవడంతో ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు చిత్రాలవైపు చూడలేదు.
నమ్రత శిరోద్కర్మహేష్ బాబు తో కలిసి వంశీ సినిమాలో నటించడానికి ముందు నమ్రత బాలీవుడ్ లో పది కంటే ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది.
ప్రియాంక చోప్రాఅందాల సుందరి ప్రియాంక చోప్రా బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి తుఫాన్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. ఆ తర్వాత భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్న తెలుగు చిత్రాలకు సైన్ చేయలేదు.
శిల్పా శెట్టిపొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి బాలీవుడ్ లో అల్లాడించింది. విక్టరీ వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు, నాగార్జున, బాలకృష్ణలతో కలిసి నటించింది.
ప్రీతి జింతాప్రేమంటే ఇదేరా సినిమాతో ప్రీతి జింతా తెలుగువారిని ఆకట్టుకుంది. రాజా కుమారుడు సినిమాలోనూ మహేష్ తో రొమాన్స్ చేసింది. కానీ ఆ తర్వాత తెలుగువారికి మొహం చాటేసింది.
కత్రినా కైఫ్కైపెక్కే చూపులు విసిరే కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాలో యువరాణిగా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణతో స్టెప్పులు వేసి.. బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.
మనీషా కొయిరాలాబాలీవుడ్లో మంచి పేరుతెచ్చుకున్న తర్వాత మనీషా కొయిరాలా కోలీవుడ్ లోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగులో క్రిమినల్ మూవీ ద్వారా అడుగుపెట్టి ఆకట్టుకుంది.
సిమ్రాన్ బగ్గాఅబ్బాయిగారి పెళ్లి సినిమాతో సిమ్రాన్ తెలుగులోకి వచ్చింది. అప్పటికే ఆమె ఐదు హిందీ చిత్రాలను చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా అవకాశాలు రావడంతో బాలీవుడ్ కంటే దక్షిణాది భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ మొదట కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కెరటం అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తక్కువకాలంలోనే టాప్ హీరోయిన్ అయింది. ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తోంది.
శ్రద్ధ కపూర్బాలీవుడ్ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్ శ్రద్ధ కపూర్. ఈమె హిందీలో ఇప్పటికే 15 చిత్రాల్లో నటించి మెప్పించింది. తొలిసారిగా ప్రభాస్ సాహో సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయం కాబోతోంది.
వీరు మాత్రమే కాకుండా శృతి హాసన్, రవీనా టాండన్, నేహా ధూపియా, నేహా శర్మ, సారా -జాన్, అయేషా టకియా, అమ్రిత రావు, దివ్య భారతి, ఊర్మిళ మటోండ్కర్, వాణి కపూర్, యామి గౌతమ్, అవికా గోర్, స్నేహ ఉల్లాల్ వంటి తారలు కూడా తెలుగులో నటించి అలరించారు.