ప్ర‌భాస్ సినిమా పై.. బాలీవుడ్ మీడియా సెన్షేష‌న్ క‌థ‌నం ఇదే..!

డార్లింగ్ ప్రభాస్ అండ్ మ‌హాన‌టి ఫేం నాగ్‌ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనె హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడ‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమా కోసం అమితాబ్ ఏకంగా 21 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం. అయితే గెస్ట్ రోల్‌కి ఇంత మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారా అనే డౌట్ వ‌స్తుంది క‌దా.. తాజా మ్యాట‌ర్ ఏంటంటే ఈ చిత్రంలో అమితాబ్ ఫుల్ లెంగ్త్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నాడ‌ని బాలీవుడ్ మీడియా తెలిపింది.

అమితాబ్‌ది క‌థ‌లో అత్యంత కీల‌క‌మైన పాత్ర అని, అందుకోస‌మే సూప‌ర్ స్టార్ 21 కోట్లు పారితోషికం తీసుకుంటున్నార‌ని బాలీవుడ్ మీడియా క‌థ‌నం ప్ర‌చురించింది. తెలుగు సైరా న‌ర‌సింహారెడ్డిలో గెస్ట్ రోల్ ప్లే చేసిన అమితాబ్ స్క్రీన్ షేరింగ్ ఎక్కువ‌గానే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఈ సినిమా కోసం ప్యాన్‌ ఇండియా ఆర్టిస్టులనే న‌టింప చేస్తున్నారు. దీంతో ఈ సినిమా బ‌డ్జెట్ పారితోషికాల‌కే దాదాపు 200 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు ఇండస్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తం సినిమా బ‌డ్జెట్ దాదాపు 500 కోట్లు దాటే చాన్స్ ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

వ‌చ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ మొద‌లు కానుండ‌గా, 2022లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని కేవలం పాన్‌ ఇండియాతో పాటు ఇత‌ర దేశాల్లో కూడా విడుదల చేయాల‌ని భావిస్తున్నారు. ఇక ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా అద్బుత దృశ్య కావ్యంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్‌ మెంటర్‌గా వ్యవహరించ‌డం విశేషం. మ‌రి ప్ర‌భాస్‌తో సినిమా అంటేనే ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీగా ఉంటాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు చిత్రాలే తీసిన ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్ ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus