బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తీక్ ఆర్యన్ పేరు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగుతోంది. ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ హీరో వరుస సినిమా విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో అగ్రహీరోగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిల ఫేవరేట్ హీరోగా మారిపోయారు. ఇకపోతే తాజాగా కార్తీక్ ఆర్యన్ నటించిన భుల్ భూలయా-2 బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.2007 సంవత్సరంలో భుల్ భూలయా అనీజ్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా భుల్ భూలయా2 ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిలంస్ బ్యానర్‌పై భూషన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో కార్తీక్ ఆర్యన్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ పాత్రలో సందడి చేశారు. హర్రర్ కథా అంశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏకంగా రెండు వందల యాభై కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టి సౌత్ సినిమాలకు పోటీగా నిలబడింది.
ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ హీరో కార్తీక్ కు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చారు. ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ మెక్‌లారెన్ జీటి కారును బహుమతిగా ఇచ్చాడు. దీని ధర దాదాపు 4.7 కోట్లు. ఇందులో మరో విశేషమేంటంటే ఇండియాలో డెలివరీ అయిన మొదటి జీటీ కారు కూడా ఇదే.
ఇక ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి విడుదల అవుతున్న సినిమా ప్రతి ఒకటి బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ పరువు నిలబెట్టారు అంటూ అతని పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!