Nagarjuna: కింగ్‌ కొత్త సినిమాకు బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ

  • May 7, 2021 / 02:46 PM IST

బాలీవుడ్లో సీనియర్‌ హీరోల పక్కన హీరోయిన్‌ అనగా గుర్తొచ్చే కొంతమంది హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఒకరు. అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌ లాంటి సూపర్‌స్టార్లతో నటించి మెప్పించిందీ డస్కీ బ్యూటీ. సీనియర్‌ హీరోల హీరోయిన్‌ అనే ట్యాగ్‌ లైన్ రావడంతో ఆ తర్వాత ఆమెకు కాస్త ఇబ్బందిపెట్టింది. అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే అదే ట్యాగ్‌ ఆమెకు దక్షిణాదిలో అవకాశాలు ఇప్పిస్తోందా అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. గతంలో రజనీకాంత్‌తో ‘లింగ’ చేసిన సోనాక్షి… ఇప్పుడు టాలీవుడ్‌లో మరో సినిమా ఓకే చేసిందట.

‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత ‘బంగార్రాజు’ పేరుతో నాగార్జున – కళ్యాణ్‌ కృష్ణ ఓ సినిమా చేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఆ సినిమాను నాగార్జున పట్టాలెక్కించాలని నిర్ణయించాడట. ఈ సినిమా కోసమే సోనాక్షి సిన్హాను తీసుకుంటున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయి. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక ఈ సినిమాకు అఫీషియల్‌ ప్రకటనలు వస్తాయట. అప్పుడే హీరోయిన్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుంది.

నాగార్జున రీసెంట్‌ సినిమాలు చూస్తే బాలీవుడ్‌ నుండే హీరోయిన్లను తీసుకొస్తున్నారు. ‘ఆఫీసర్‌’, ‘దేవ్‌దాస్‌, ‘వైల్డ్‌ డాగ్‌’ ఇలా వరుస సినిమాలకు అయితే బాలీవుడ్‌ నాయిక, లేదంటే సీనియర్‌ నాయికల్ని తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా బాలీవుడ్‌ హీరోయిన్‌ వైపే చూస్తున్నారు. అయితే సోనాక్షి గతంలో చేసిన సౌత్‌ సినిమా దారుణంగా బెడిసి కొట్టింది. అదే ‘లింగ’.అలా అని ఆమెకు బాలీవుడ్‌లోనూ సరైన ట్రాక్‌ రికార్డు లేదు. ఇప్పుడు మరి సోనాక్షిని ఎంచుకొని నాగ్‌ ఏం చేస్తాడో?

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus