Kamal Haasan: కమల్‌ హాసన్‌ కోసం బాలీవుడ్‌ స్టార్‌ వచ్చారా

కమల్‌ హాసన్‌ను ఫుల్‌ మాస్‌ యాంగిల్‌ని మరోసారి చూపించడానికి దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ చేస్తున్న ప్రయత్నం ‘విక్రమ్‌’. సినిమా ప్రచార చిత్రాలు చూస్తేనే ఈ విషయం అర్థమైపోతుంది. అయితే దీనికి అదనపు హంగులుగా ఇందులో కీలక పాత్రల కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులను తీసుకున్నాడు. అలా బాలీవుడ్‌ నుండి కూడా ఓ ప్రముఖ నటుడు సినిమాలో నటించారని సమాచారం. దీంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

Click Here To Watch NOW

లోక నాయకుడు కమల్‌ హాసన్, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి… ఇవీ ఫహాద్‌ ఫాజిల్‌ ఇదీ ఇప్పటివరకు ‘విక్రమ్‌’ సినిమా గురించి మాట్లాడితే వచ్చే పేర్లు. ఇప్పుడు వీటికి అమితాబ్‌ బచ్చన్‌ పేరు కూడా యాడ్‌ చేసుకోవచ్చు. అవును ఈ సినిమాలో బిగ్‌బీ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి షూటింగ్‌ కూడా పూర్తిచేశారని అంటున్నారు. అయితే ఆ పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇంకా తెలియరాఏలదు.

ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘విక్రమ్‌’ సినిమా వేసవి కానుకగా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మేకింగ్‌ వీడియో అదిరిపోయింది. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన గ్లింప్స్‌ని ఆ వీడియోలో చూపించారు. ఎక్కువగా రాత్రి సమయాల్లో తీసిన సీన్సే ఆ వీడియోలో ఉన్నాయి. లోకేశ్‌ సినిమా ఎలా ఉంటుందో ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలతో చూశాం. ఇప్పుడు కమల్‌ను ఎలా చూపిస్తారనేదే విషయం.

సినిమా ప్రారంభమైన కొత్తల్లో విడుదల చేసిన వీడియో వైబ్స్‌ ఇంకా తగ్గలేదు. ఇప్పుడు రిలీజ్‌ చేసిన వీడియోలో ఆ వైబ్స్‌ సినిమాలోనూ ఉంటే బ్లాక్‌ బస్టర్‌ పక్కా అని చెప్పొచ్చు. అనిరుథ్‌ సంగీతం, లోకేశ్ కనగరాజ్‌ ఆలోచనలు వాటికి కమల్‌ హాసన్‌ నటన కలిస్తే బొమ్మ అదుర్సే అంటున్నారు ప్రేక్షకులు. జూన్‌ 3న నాలుగు పవర్‌ హౌస్‌ల పర్‌ఫార్మెన్స్‌ ఒకే స్క్రీన్‌ మీద చూసేయొచ్చు. కాబట్టి ఫ్యాన్స్‌ వెయిట్‌ చేయండి మరి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus