కాజోల్ నుండి వరుణ్ ధావన్ వరకు ఓటీటీలో హంగామా చేయనున్న స్టార్స్ ఎవరంటే..?

మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి.. ఇండియన్ సినిమా ఎప్పటికప్పుడు కొత్త హంగులతో ప్రేక్షకులను అలరించడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉంది.. థియేటర్‌కి ధీటుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ వేగం పుంజుకుంది.. ఓటీటీలకు విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్స్‌తో ఆడియన్స్‌కి మరింత వినోదాన్ని పంచి పెడుతున్నాయి.. క్యారెక్టర్ ఆర్టిస్టులే కాదు.. టాప్ స్టార్స్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అలరించారు.. బిగ్ స్క్రీన్ మీదే కాదు.. ఓటీటీలోనూ సందడి చెయ్యడానికి మరికొంతమంది సిద్ధమవుతున్నారు.. ఈ 2023లో డిజిటల్ డెబ్యూ ఇస్తున్న స్టార్స్ ఎవరో చూద్దాం..

1) కాజోల్..

తన అందం, అభినయంతో హిందీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన కాజోల్.. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది.. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అమెరికన్ కోర్ట్ రూమ్ డ్రామా ‘ది గుడ్ వైఫ్’ సిరీస్ ఆధారంగా.. అదే పేరుతో.. సుపర్ణ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిరీస్‌.. డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది..

2) కరీనా కపూర్..

‘ది డివోషనల్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ సిరీస్‌తో కరీనా కపూర్ డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది.. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో.. ఓ నవలను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు.. ఓ పాపులర్ ఓటీటీ వేదికగా ఈ సిరీస్ విడుదల కానుంది..

3) ఆదిత్య రాయ్ కపూర్..

యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్.. హాలీవుడ్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న పాపులర్ సిరీస్ ‘ ది నైట్ మేనేజర్’ ను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు.. అనిల్ కపూర్, శోభిత ధూళిపాళ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.. సుసనా బేర్ డైరెక్ట్ చేశారు..

4) ఊర్మిళ..

ఇప్పటికే మాధురి దీక్షిత్, సైఫ్ అలీ ఖాన్ వంటి సీనియర్ స్టార్స్ ఓటీటీలో అలరిస్తుండగా.. ఇప్పుడు మరో సీనియర్ స్టార్ ఊర్మిళ మతోండ్కర్ ‘తివారి’ అనే థ్రిల్లర్ సిరీస్‌తో ఎంట్రీ ఇస్తుంది.. తల్లీ – కూతుళ్ల చుట్టూ తిరిగే కథ ఇది.. సౌరభ్ వర్మ దర్శకుడు..

5) సిద్ధార్థ్ మల్హోత్రా..

సౌత్ తరహా కథలు, పోలీస్ స్టోరీలతో సూపర్ హిట్స్ అందుకున్న రోహిత్ శెట్టి దర్శకత్వంలో.. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో.. ఎనిమిది భాగాలుగా ఓ కాప్ డ్రామా రూపొందుతుంది.. దీంతో సిద్ధార్థ్ మల్హోత్రా ఓటీటీలోకి వస్తున్నాడు.. శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు..

6) సోనాక్షి సిన్హా..

‘దహాద్’ అనే యాక్షన్ సిరీస్‌తో సోనాక్షి సిన్హా డిజిటల్ డెబ్యూ ఇవ్వనుంది.. విజయ్ వర్మ, సోహమ్ షాలతో కలిసి నటిస్తుంది.. పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనుంది సోనాక్షి..

7) వరుణ్ ధావన్..

‘ది ఫ్యామిలీ మెన్ -2’ లో అదరగొట్టేసిన స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నాడు వరుణ్ ధావన్.. ‘సిటాడెల్’ అనే హాలీవుడ్ సిరీస్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌కి ‘ఫ్యామిలీ మెన్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.. సమంత – వరుణ్ ధావన్ వంటి టాప్ స్టార్స్ నటిస్తున్న ‘సిటాడెల్’ మీద మంచి అంచనాలున్నాయి..

8) అనన్య పాండే..

‘లైగర్’ తో పాన్ ఇండియా గుర్తింపు వస్తుందని ఆశలు పెట్టుకున్న అనన్య పాండేకు చుక్కెదురైంది.. దీంతో ‘కాల్ మీ బే’ అనే సిరీస్‌తో ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.. వరుణ్ సూద్‌కి జంటగా నటిస్తోంది అనన్య..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus