పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” చిత్రంతో తెలుగులో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఆ తర్వాత “బెంగాల్ టైగర్, అజ్ణాతవాసి” వంటి సినిమాల్లో నటించినప్పటికీ మొదటి సినిమా స్థాయిలో వేరే చిత్రాలు ఆయనకు పేరు తీసుకురాలేకపోయాయి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆయనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నాడు “అప్పట్లో ఒకడుండేవాడు” ఫేమ్ సాగర్ చంద్ర. వరుణ్ తేజ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే నెల నుంచి ఓ నూతన చిత్రం ప్రారంభమవుతోంది. 14 రీల్స్ సంస్థలో రూపొందనున్న ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ ఇటీవల పూర్తవ్వడంతో క్యాస్టింగ్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు సాగర్.
ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర కోసం బోమన్ ఇరానీని సంప్రదించగా.. చాలెంజింగ్ రోల్ కావడంతో ఇమ్మీడీయట్ గా అంగీకరించాడట ఆయన. వరుణ్ ప్రస్తుతం “అంతరిక్షం, ఎఫ్ 2” చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు చివరి షెడ్యూల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ పూర్తికాగానే వరుణ్ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. వరుణ్ స్పీడ్ చూస్తుంటే.. త్వరలోనే నవతరం మెగా హీరోలందరీలోకెల్లా ఎక్కువ చిత్రాలు చేసేలా ఉన్నాడు.