Boyapati Srinu, Yash: బోయపాటితో యష్ సినిమా వర్కవుట్ అవుతుందా..?

  • August 24, 2021 / 10:32 PM IST

‘కేజీఎఫ్’ సినిమాతో కన్నడ హీరో యష్ కి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అతడి కోసం టాలీవుడ్ దర్శకులు కూడా కథలు రెడీ చేస్తున్నారు. బోయపాటి శ్రీను చాలా కాలంగా యష్ తో సినిమా అనుకుంటున్నారు. ‘అఖండ’ సినిమా తరువాత యష్ ని కలిసి కథ వినిపించబోతున్నారు. అయితే యష్ కోసం బోయపాటి కొత్తగా ఎలాంటి కథ రాయలేదు. తన దగ్గర ఉన్న కథనే యష్ కి సూట్ అయ్యే విధంగా మారుస్తున్నారట.

గతంలో బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘వినయ విధేయ రామ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్లాప్ అయింది. దానికంటే ముందు చరణ్ కి ఓ కథ వినిపించాడు బోయపాటి శ్రీను. అది బాగానే ఉన్నప్పటికీ.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయని భావించిన చరణ్ ‘వినయ విధేయ రామ’ కథ ఓకే చేశాడు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ బోయపాటి ముందు చెప్పిన కథతో రామ్ చరణ్ సినిమా చేయాలనుకున్నాడు.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బోయపాటితో చరణ్ సినిమా చేసే అవకాశాలు లేవు. అందుకే బోయపాటి ఈ కథను యష్ కి అనుగుణంగా మారుస్తున్నారని సమాచారం. చాలా కాలంగా యష్ తెలుగులో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తో ప్లాన్ కూడా చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు బోయపాటితోనైనా సినిమా సెట్ అవుతుందేమో చూడాలి!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus