ఎన్టీఆర్ తో తీసిన “దమ్ము” తప్ప బోయపాటికి మొన్నటివరకూ ఫ్లాప్ అనేది లేదు. అయితే.. “వినయ విధేయ రామ” డిజాస్టర్ మాత్రం ఆయన కెరీర్ ను చాలా దెబ్బ తీసింది. రామ్ చరణ్ కెరీర్ లో మాత్రమే కాక యావత్ తెలుగు సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా “వినయ విధేయ రామ” నిలిచింది (కలెక్షన్స్ పరంగా కాదు). ఆ సినిమా తర్వాత మహేష్ బాబుని డైరెక్ట్ చేయాల్సిన బోయపాటికి సూపర్ స్టార్ ఇంటికి గేట్లు మూసుకుపోవడం గమనార్హం. దాంతో.. తన ఫేవరెట్ హీరో బాలయ్య పంచన చేరిన బోయపాటి త్వరలోనే ఆయన హీరోగా సినిమా మొదలెట్టానున్నాడు.
ఇకపోతే.. “వినయ విధేయ రామ” వరకు దాదాపు 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొన్న బోయపాటి.. బాలయ్య సినిమాకి మాత్రం తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ లో సగం మాత్రమే అందుకొన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి బోయపాటి అందుకొన్న రెమ్యూనరేషన్ కేవలం 8 కోట్లు మాత్రమే. బోయపాటి మళ్ళీ బోయపాటి తన పూర్వ వైభవాన్ని కానీ.. పూర్వపు పారితోషికాన్ని అందుకోవాలంటే బాలయ్య సినిమాతో బంపర్ హిట్ కొట్టాల్సిందే.
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!