Brahmaji: బ్రహ్మాజీ కొత్త ట్వీట్‌ చూస్తే షాక్‌ అవుతారు!

బ్రహ్మాజీ మంచి నటుడు… అంతకుమించి మంచి చతురుడు కూడా. ఏ విషయాన్నైనా తనదైన శైలిలో వ్యంగ్యంగా చెప్పగలరు. అలా ఆయన చేసిన ఓ ట్వీటు ఇప్పుడు ట్విటర్‌ వరల్డ్‌లో సందడి చేస్తోంది. అందులో ఆయన రాసింది కొత్త విషయమేమీ కాదు. చాలా మందికి అప్పుడప్పుడు జరుగుతున్నదే. అదే ‘మీకు కోట్ల రూపాయాల లాటరీ వచ్చిందనే మెసేజ్‌’. తనకొచ్చిన లాటరీ మెసేజ్‌ను అటాచ్‌ చేసి చేస్తూ బ్రహ్మాజీ ఓ ట్వీట్‌ చేశారు. అదే ఇప్పుడు సరదా టాపిక్‌.

ల్యాండ్ రోవ‌ర్ కంపెనీ త‌ర‌ఫున‌ మీ మొబైల్ నంబ‌రు ₹4,65,00,000 గెలుచుకుంది. ఈ డబ్బు మీరు పొందాలంటే మీ పేరు, చిరునామా త‌దిత‌ర వివరాల్ని ఈ ఈ-మెయిల్‌కి పంపించండి అంటూ చాలామందికి వచ్చినట్లే బ్రహ్మాజీకి వచ్చింది. దాన్ని ఆయన స్క్రీన్ షాట్ తీసి ‘స‌ర్! నాకు ఈ నంబ‌రు నుండి మెసేజ్ వ‌చ్చింది. ద‌య‌చేసి డ‌బ్బుని తీసుకోండి అంటూ హైద‌రాబాద్ సిటీ పోలీసు, సైబ‌రాబాద్ పోలీసు శాఖ ట్విట‌ర్ ఖాతాల‌ను మెన్షన్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు బ్రహ్మాజీ.

బ్రహ్మాజీ ట్వీట్‌ కింద కామెంట్లు చూస్తే.. భలే ఫన్నీగా ఉన్నాయి. అంత డబ్బు ఇస్తానంటే వద్దంటున్న మహానుభావుడు మా బ్రహ్మాజీ అని కొందరు. ఇంతకంటే పెద్ద అమౌంట్‌తోనే మాకు మెసేజ్‌లు వచ్చాయి అని ఇంకొందరు ట్వీట్‌ చేస్తున్నారు. అదేంటో మీ లాంటి ఉన్నవాళ్లకే జాక్‌పాట్లు దొరుకుతాయని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఆ మెసేజ్‌ చూసి బ్రహ్మాజీ షాక్ అయ్యారో లేదో కానీ, ఆ ట్వీట్‌ చూసి పంపినాయన షాక్‌ అయ్యి ఉంటాడు.


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus