దాదాపుగా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కు వారం రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి. బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ తో పోలిస్తే బ్రహ్మాస్త్ర హిందీ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది.
రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడం ఈ సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచింది. అయితే బ్రహ్మాస్త్ర హిందీ వెర్షన్ టికెట్ రేటు హైదరాబాద్ లో 325 రూపాయలుగా ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకే ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెడితే ప్రేక్షకులు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బ్రహ్మాస్త్ర సినిమాను ఇంత రేటు పెట్టి ప్రేక్షకులు చూస్తారా అనే ప్రశ్నకు చూడరనే సమాధానం వినిపిస్తోంది.
టికెట్ రేట్ల విషయంలో ఈ సినిమా మేకర్స్ అత్యాశకు పోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బ్రహ్మాస్త్రం సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మధ్య కాలంలో వరుసగా బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు.
అందువల్ల బ్రహ్మాస్త్ర సినిమాపైనే ఈ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది. రణ్ బీర్ కపూర్, అలియా భట్ లకు ఈ సినిమాతో సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే పార్ట్2, పార్ట్3 తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ సినిమాను చూడటం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర