Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bramhastra Trailer: అయాన్‌ ముఖర్జీ కలల ప్రాజెక్ట్‌ ఎంట్రీ అదిరిపోయిందిగా!

Bramhastra Trailer: అయాన్‌ ముఖర్జీ కలల ప్రాజెక్ట్‌ ఎంట్రీ అదిరిపోయిందిగా!

  • June 15, 2022 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bramhastra Trailer: అయాన్‌ ముఖర్జీ కలల ప్రాజెక్ట్‌ ఎంట్రీ అదిరిపోయిందిగా!

కొన్ని సినిమాలు పూర్తి కావడానికి ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. కానీ ఆ సినిమా అవుట్‌పుట్‌ చూసినప్పుడు అన్నేళ్లు పట్టడం కరెక్టే అనిపిస్తుంది. అయితే ఈ మాట అనిపించుకోవాలంటే ఆ సినిమా టీమ్‌ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి చేసిన సినిమా ఎంట్రీ లుక్‌ అదే ట్రైలర్‌ చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటుంటారు. అలాంటి ఫీలింగ్‌ కలిగించిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా విడుదల చేస్తున్నారు.

బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆయాన్‌ ముఖర్జీ కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమైన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. సుమారు ₹400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. లోకంలోని వివిధ అస్త్రాల విశిష్ఠతను తెలియజేసే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం.. పార్ట్‌ 1 శివ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సెప్టెంబర్‌ 9న విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు లాంచ్‌ చేశారు. తెలుగులో ఈ ట్రైలర్‌కు చిరంజీవి వాయిస్‌ ఓర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘‘నీరు, గాలి, నిప్పు ప్రాచీన కాలం నుండి అవి మనతోనే ఉన్నాయి. ఇక, వాటి శక్తి కొన్ని అస్త్రాల్లో దాగుంది. అస్త్రాలన్నింటికీ దేవతైన ‘బ్రహ్మాస్త్రం’ గురించే ఈ కథ. అలాగే ‘బ్రహ్మాస్త్రం’ విధి కనిపెట్టే ఓ యువకుడి కథ ఇది. అతనే శివ’’ అనే మాటలతో ట్రైలర్‌ ప్రారంభవుతుంది. ఆ తర్వాత కనిపించే ప్రతి సీన్‌ అద్భుతమనే చెప్పాలి.

సినిమాలో ఓ వైపు యువ జంట ప్రేమను చూపిస్తూనే, మరోవైపు బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు శివ, నంది అస్త్రం దుష్టశక్తులతో చేసే పోరాటాన్ని చూపించారు. ఇషా – శివ ప్రేమాయణం ఫ్రెష్‌గా ఉంది. ‘‘ఇషా నేను నిప్పులో కాలను. నాకు నిప్పుతో ఏదో తెలియని అనుబంధం ఉంది. నిప్పు నన్ను కాల్చలేదు’’ అంటూ రణ్‌బీర్‌ చెప్పిన డైలాగ్‌ సినిమా ప్రధానాంశాన్ని చెప్పేలా ఉంది. ధర్మా ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేస్తున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Ayan Mukherji
  • #Brahmastra
  • #karan johar
  • #Rajamouli

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version