కొన్ని సినిమాలు పూర్తి కావడానికి ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. కానీ ఆ సినిమా అవుట్‌పుట్ చూసినప్పుడు అన్నేళ్లు పట్టడం కరెక్టే అనిపిస్తుంది. అయితే ఈ మాట అనిపించుకోవాలంటే ఆ సినిమా టీమ్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి చేసిన సినిమా ఎంట్రీ లుక్ అదే ట్రైలర్ చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటుంటారు. అలాంటి ఫీలింగ్ కలిగించిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా విడుదల చేస్తున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమైన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. సుమారు ₹400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. లోకంలోని వివిధ అస్త్రాల విశిష్ఠతను తెలియజేసే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం.. పార్ట్ 1 శివ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సెప్టెంబర్ 9న విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు. తెలుగులో ఈ ట్రైలర్‌కు చిరంజీవి వాయిస్ ఓర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘‘నీరు, గాలి, నిప్పు ప్రాచీన కాలం నుండి అవి మనతోనే ఉన్నాయి. ఇక, వాటి శక్తి కొన్ని అస్త్రాల్లో దాగుంది. అస్త్రాలన్నింటికీ దేవతైన ‘బ్రహ్మాస్త్రం’ గురించే ఈ కథ. అలాగే ‘బ్రహ్మాస్త్రం’ విధి కనిపెట్టే ఓ యువకుడి కథ ఇది. అతనే శివ’’ అనే మాటలతో ట్రైలర్ ప్రారంభవుతుంది. ఆ తర్వాత కనిపించే ప్రతి సీన్ అద్భుతమనే చెప్పాలి.
సినిమాలో ఓ వైపు యువ జంట ప్రేమను చూపిస్తూనే, మరోవైపు బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు శివ, నంది అస్త్రం దుష్టశక్తులతో చేసే పోరాటాన్ని చూపించారు. ఇషా – శివ ప్రేమాయణం ఫ్రెష్‌గా ఉంది. ‘‘ఇషా నేను నిప్పులో కాలను. నాకు నిప్పుతో ఏదో తెలియని అనుబంధం ఉంది. నిప్పు నన్ను కాల్చలేదు’’ అంటూ రణ్‌బీర్ చెప్పిన డైలాగ్ సినిమా ప్రధానాంశాన్ని చెప్పేలా ఉంది. ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేస్తున్నారు.
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!