RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

‘బ్రేకింగ్ బ్యాడ్’ వెబ్ సిరీస్..కి గ్లోబల్ వైడ్ మంచి అప్రీషియేషన్ లభించింది. దానికి కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి. విషయంలోకి వెళితే.. ‘బ్రేకింగ్ బ్యాడ్’ హీరో అయినటువంటి ఆర్ జె మిట్టే ఈరోజు కన్నుమూశారు. వాల్టర్ వైట్ కొడుకు వాల్టర్ వైట్ జూనియర్/ఫ్లిన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు ఆర్.జె. మిట్టే(RJ Mitte). అతని వయసు కేవలం 34 ఏళ్ళు మాత్రమే కావడం గమనార్హం.

RJ Mitte

ఆర్ జె మిట్టే మరణవార్త హాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ అభిమానులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది అని చెప్పాలి. అమెరికాలోని టెక్సాస్, బ్రౌన్స్‌విల్లేలో మిట్టే అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించారు. దీంతో స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అంచనా ప్రకారం.. మిట్టే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

అయితే, పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు బయటకు వస్తాయి. ‘బ్రేకింగ్ బ్యాడ్’ సిరీస్‌లో తన పాత్రలానే, మిట్టేకు నిజ జీవితంలో కూడా ‘సెరిబ్రల్ పాల్సీ’ అనే నాడీ సంబంధిత వ్యాధి ఉందట. 3 ఏళ్ళ వయసులోనే ఈ వ్యాధి గురించి బయటపడినట్టు తెలుస్తోంది. అయినా సరే శారీర బలహీనతల్ని పక్కన పెట్టి.. నటనపై ప్యాషన్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ‘బ్రేకింగ్ బ్యాడ్’ సిరీస్ లో తన పాత్ర కోసం ప్రత్యేకంగా ఊతకర్రలతో నడవడం, మాట తడబడేలా మాట్లాడటం వంటివి కూడా ప్రాక్టీస్ చేశాడట మిట్టే.

ఆ సిరీస్ తో వచ్చిన క్రేజ్ ద్వారా…. మిట్టేకి చాలా సినిమాల్లో, టీవీ షోలలో పెర్ఫార్మ్ చేసే అవకాశలు వచ్చాయట. మరోవైపు దివ్యాంగుల హక్కుల కోసం మిట్టే… గళం విప్పి ఎందరికో స్ఫూర్తిగా కూడా నిలిచాడు.

మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus