శ్రీవిష్ణు నుండీ ఒక సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్..లో శ్రీవిష్ణుకి మంచి క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా.. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్'(Comrade Kalyan). జానకీరామ్ మారెళ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కోన వెంకట్ ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా వ్యవహరించారు. విజయ్ బుల్గేనిన్ సంగీత దర్శకుడు. ‘ఒరియా పిల్లా’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ వంటివి కూడా పర్వాలేదు అనిపించాయి.
మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ చిత్ర బృందం ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా ప్రమోట్ చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 2.62 cr |
| సీడెడ్ | 0.56 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.78 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 4.96 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.48 cr |
| ఓవర్సీస్ | 0.60 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 6.04 cr (షేర్) |
‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రానికి రూ.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రానికి రూ.6.04 కోట్ల షేర్ నమోదలైంది. గ్రాస్ పరంగా రూ.11.95 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.46 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.