Rashmika, Pooja Hegde: రష్మిక, పూజా హెగ్డే ఇద్దరికీ దెబ్బ పడిందిగా..!

Ad not loaded.

రష్మిక మందన, పూజా హెగ్డే ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న హీరోయిన్లు. వీళ్ళ స్టార్ డం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాదు బాలీవుడ్లో కూడా ఈ భామలకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. తమిళ్ లో కూడా అంతే! రష్మిక అయితే కన్నడలో స్టార్ హీరోయిన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మార్చి నెలలో ఈ ఇద్దరి భామలకు పెద్ద దెబ్బ పడింది. ముందుగా రష్మిక సంగతికి వద్దాం.

Click Here To Watch Now

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అంటూ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకుడు. సినిమాకి యావరేజ్ టాక్ అయితే వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏమాత్రం రాణించలేకపోయింది. రష్మిక స్టార్ స్టేటస్ కూడా ఈ సినిమాకి కలిసిరాలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప’ వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడికి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ బ్రేక్ వేసింది.

ఇక మరోపక్క పూజా హెగ్డే. ఈమెకి కూడా పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ నెలలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం ‘రాధే శ్యామ్’ ఘోర పరాజయం పాలైంది. ఈ మూవీకి కూడా యవరేజ్ టాక్ వచ్చింది కానీ ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ సినిమా ఇది కాదు అని చాలా మంది కొట్టి పడేసారు. ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ వద్ద ఎపిక్ డిజాస్టర్ గా నిలవడం ఖాయం అని మేకర్స్ తేల్చేసారు.

‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘గడ్డలకొండ గణేష్’ ‘అల వైకుంఠపురములో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజకి ‘రాధే శ్యామ్’ పెద్ద దెబ్బె అని చెప్పాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus