పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ .. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. కానీ మొదటి వీక్ డేస్ లో మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి.ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 18.96 cr |
సీడెడ్ | 6.11 cr |
ఉత్తరాంధ్ర | 6.18 cr |
ఈస్ట్ | 4.19 cr |
వెస్ట్ | 3.92 cr |
గుంటూరు | 4.17 cr |
కృష్ణా | 3.05 cr |
నెల్లూరు | 1.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 48.08 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.38 cr |
ఓవర్సీస్ | 6.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 59.86 cr (షేర్) |
‘బ్రో’ (Bro) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.59.86 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.38.64 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది.
వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాబట్టలేకపోతుంది. ఈ వీక్ మొత్తం స్టడీగా రాణించి వీకెండ్ కి గ్రోత్ చూపించకపోతే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?