Bro Collections: ‘బ్రో’.. 6 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Advertisement

పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి.

జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ .. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. కానీ వీక్ డేస్ లో మాత్రం కలెక్షన్స్ చాలా వరకు డ్రాప్ అయ్యాయి.ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 19.37 cr
సీడెడ్ 6.28 cr
ఉత్తరాంధ్ర 6.33 cr
ఈస్ట్ 4.27 cr
వెస్ట్ 3.98 cr
గుంటూరు 4.24 cr
కృష్ణా 3.13 cr
నెల్లూరు 1.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 49.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.55 cr
 ఓవర్సీస్ 6.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 61.24 cr (షేర్)

‘బ్రో’ (BRO) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి రూ.61.24 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.37.26 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది.

వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాబట్టలేకపోతుంది. ఈ వీక్ మొత్తం స్టడీగా రాణించి వీకెండ్ కి గ్రోత్ చూపించకపోతే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news