Sarkaru Vaari Paata: మహేష్ సినిమా బడ్జెట్ దాటేసిందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’. చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోని మోసాలు, బడా వ్యాపారవేత్తల కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయ‌బోతున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12నే విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు.

Click Here To Watch NOW

కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఈ రెండు పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఉగాది సంద‌ర్భంగా ‘స‌ర్కారు వారి పాట’ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ మించిపోతుందని సమాచారం. మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇదేనని చెబుతున్నారు.

ఈ సినిమా బిజినెస్ తో పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టుకోవచ్చనేది నిర్మాతల ఆలోచన. ఒక్క నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ స్పెయిన్, గోవాలలో జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రుపొండుస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తమన్ బాణీలు కడుతున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus