నిన్న ‘పళ్లి చట్టంబి’ సినిమా టీజర్ లాంచ్ వేడుక జరిగింది.దీనికి అతిథిగా బన్నీ వాస్ హాజరయ్యాడు. ఈ ఈవెంట్లో భాగంగా నిర్మాతలు తెలుగులో కూడా స్ట్రైట్ మూవీ చేయాలనే ఆశ ఉన్నట్టు తెలిపారు. కానీ మన టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ మాత్రం ‘అప్పుడే కంగారు పడకండి’ అంటూ కామెంట్ చేశారు.
‘అలా ఎందుకు చెప్పారు?’ అంటూ నిర్మాత బన్నీ వాస్ ను ఓ రిపోర్టర్ ప్రశ్నించడం జరిగింది. అందుకు ఆయన సమాధానమిస్తూ… “తెలుగుతో పోలిస్తే మలయాళ చిత్ర పరిశ్రమలో సినిమా హిట్టయితే వచ్చే రాబడి చాలా బాగుంటుంది.ముఖ్యంగా కథాబలమున్న సినిమాలకి మలయాళంలో థియేటర్ నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది.తెలుగులో ఆ స్థాయి రెవెన్యూ ఉండదు” అని బన్నీవాస్ అభిప్రాయపడ్డారు.బన్నీ వాస్ వ్యాఖ్యల్లో చాలా డెప్త్ ఉంది. మలయాళం సినిమాలు తక్కువ బడ్జెట్లో తీసినా బాగా సక్సెస్ అవుతాయి.థియేటర్స్ లో మంచి రెవెన్యూ చేస్తాయి.
ముఖ్యంగా సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగుంటాయి. తక్కువ రోజుల్లో సినిమాని కంప్లీట్ చేస్తారు. ఈ మధ్య కాలంలో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న సినీ పరిశ్రమ అని కూడా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ సినిమాలు మాత్రం అనుకున్న టైంలో కంప్లీట్ అవ్వవు, బడ్జెట్ ఎక్కువవుతుంది. షూటింగ్ డేస్ కూడా ఎక్కువగా అవుతాయి. అంతేకాదు సినిమా హిట్ అయితే నిర్మాతకి లాభాలు కూడా వెంటనే రావు అనే అభిప్రాయాలూ ఉన్నాయి. బహుశా అందుకే అనుకుంట బన్నీ వాస్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు కొందరు అనుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే టాలీవుడ్ నిర్మాతలు ఎక్కువగా మలయాళ సినిమాలు చేసుకోవడం బెటర్ అంటూ అభిప్రాయపడుతున్నారు.