సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ లలో శంకర్ ఒకరు. ఇండియన్ సినిమా రేంజ్ ని పెంచిన ఈ దర్శకుడు ఒక సినిమా మొదలుపెడితే అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. కానీ శంకర్ మీద నమ్మకంతో నిర్మాతలు అతడికి కావాల్సినవన్నీ ఎరేంజ్ చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో శంకర్ కి, నిర్మాతలకు మధ్య చాలా విభేదాలు వస్తున్నాయి. ‘రోబో2’ సమయంలో లైకా సంస్థతో శంకర్ కి గొడవలు వచ్చాయి. ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది.
బడ్జెట్ పెరిగిపోవడం ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమాను ఏకంగా పక్కన పెట్టేశారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు శంకర్ తో కలిసి దిల్ రాజు ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. నిజానికి ‘ఇండియన్ 2’ సినిమాకి దిల్ రాజు కూడా నిర్మాతగా వ్యవహరించాల్సివుంది. కానీ ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ చేతులు మారింది. ఆ సమయంలో శంకర్ కి అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ తోనే దిల్ రాజుతో సినిమా చేయడానికి శంకర్ అంగీకరించాడు. రామ్ చరణ్ హీరోగా ఈ సినిమా మొదలుకానుంది.
అయితే మేకింగ్ విషయంలో దిల్ రాజు స్టైల్ వేరు.. శంకర్ స్టైల్ వేరు. దిల్ రాజు తన ప్రాజెక్ట్ లన్నీ కూడా ప్లానింగ్ ప్రకారం జరిగేలా చూసుకుంటాడు. కానీ శంకర్ అలా కాదు. ఆయన సినిమా ఓ పట్టాన పూర్తవదు. మరి శంకర్ ని దిల్ రాజు కంట్రోల్ చేయగలడా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దిల్ రాజు ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడని.. సినిమాని ఇంతలోనే పూర్తి చేయాలి.. ఈ టైమ్ కి పూర్తి చేయాలనే నిబంధనలతో రంగంలోకి దిగబోతున్నాడని చెబుతున్నారు. ఇలాంటి షరతులు శంకర్ కి కొత్తేమీ కాదు. ఎన్ని షరతులు పెట్టినా.. ఆయన అనుకున్న సమయానికే సినిమాని పూర్తి చేస్తాడు. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి!
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?