50 కోట్ల మార్కైనా దాటేనా ?!
- April 12, 2016 / 02:21 PM ISTByFilmy Focus
తొలి రోజు దుమ్ము దులిపి.. బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డులు సృష్టించిన సర్దార్ గబ్బర్ సింగ్ రెండో రోజు పూర్తిగా డల్ అయ్యింది. సగానికి సగం వసూళ్లు పడిపోయాయి. ఇక మూడో రోజు మరీ దారుణం.. 70 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. దాదాపుగా అన్ని థియేటర్లూ ఖాళీగా కనిపించాయి. దాంతో సర్దార్ హంగామా.. తొలి రోజుకే పరిమితమైనట్టైంది. తొలిరోజు 30 కోట్లకు పైగానే వసూలు చేసి.. షేక్ చేసిన సర్దార్. మిగిలిన రెండు రోజుల్లో రూ.25 కోట్లు కూడారాబ్టలేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మొత్తానికి తొలి మూడు రోజుల్లో 55.6 కోట్ల గ్రాస్ సాధించింది. షేర్ లెక్కల్లో చూస్తే.. 39 కోట్లకు లెక్క తేలుతోంది. సోమవారం నుంచి వసూళ్లు మరింత క్షీణించాయి. దాంతో ఈ సినిమా 50 కోట్లయినా దక్కించుకొంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















