Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

  • April 1, 2026 / 10:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘కార్మేని సెల్వం'(Carmeni Selvam).  పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకుడు.

Carmeni Selvam

తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘కార్మేని సెల్వం’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు.

లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.’మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్’ అంటూ ‘మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ’ పేరుతో రామానుజన్ ఎంకే తమ సంస్థ ద్వారా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ‘అరెరె’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్’ ద్వారా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా సంగీత దర్శకుడు రామానుజన్ ఎంకే కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఆయన మాట్లాడుతూ… “ఒక చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘనత ఏ ఒక్క వ్యక్తికీ కాకుండా, ఒక సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో ‘Musicloud Studio & Technology’ని ప్రారంభించడం జరిగింది. మొదట్లో కార్పొరేట్ ప్రాజెక్టులను స్వీకరిస్తూ, నెమ్మదిగా నా పనితీరును మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మీడియా సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ప్రారంభించాను.

మేము సౌండ్ డిజైన్, వాయిస్‌ఓవర్లు మరియు డబ్బింగ్ వంటి అన్ని సేవలను అందించాము.ప్రస్తుతం ‘కార్మేని సెల్వం’ ప్రాజెక్టును విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా.. (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది.

ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం.ఇటువంటి సేవను వినియోగించుకోవడం ద్వారా, చిత్ర నిర్మాతలకు మ్యూజిక్ క్లౌడ్ స్టూడియోకు మధ్య ఒక రెవెన్యూ మోడల్ రూపొందించబడింది. ఈ ఆదాయ నమూనా కింద, సౌండ్ ఇంజనీర్లు, వాయిద్యకారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది.

మేము సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాము. సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు.నేను గతంలో దర్శకుడు రామ్‌తో కలిసి అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించిన ‘కురైయొండ్రుమ్ ఇల్లై’ చిత్రానికి పనిచేశా. ఇప్పుడు ‘కార్మేని సెల్వం’ లాంటి గొప్ప ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది. డైరెక్టర్ రామ్ చక్రి గారితో పరిచయం నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది.

‘కార్మేని సెల్వం’ సినిమా కోసం 4 పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, OST ట్రాక్స్ కంపోజ్ చేశాను. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. మా Music Cloud టీమ్‌లో 4-5 మంది కలిసి పనిచేస్తున్నాం.సంగీతం ఎప్పుడూ ఒక వ్యక్తి పని కాదు అది టీమ్ వర్క్. ‘అరెరె’ పాటకు తెలుగులో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తండ్రి-కొడుకు మధ్య బంధాన్ని చూపించే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఇందులో వైలిన్, ఫ్లూట్ బదులు సరంగి ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది. అది భావోద్వేగాన్ని మరింత బలంగా చూపించింది.

సముద్రఖని గారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు.ఎమోషనల్, ఫ్యామిలీ సినిమాలకు మ్యూజిక్ చేయడం చాలా కష్టం. ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు గారు చాలా సపోర్టివ్, సింపుల్ వ్యక్తి.ఆయన అందరి పనిని గమనిస్తూ ప్రోత్సహిస్తారు.కనీసం 10 మంచి, అర్థవంతమైన సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలని నా కోరిక. నేను ఎవరితోనూ పోల్చుకోను. మంచి కథలు, మంచి సినిమాల్లో భాగం కావడం నా లక్ష్యం. తెలుగులో ‘హ్యాపీ డేస్’ ‘ఆనంద్’ ‘గోదావరి’ లాంటి ఫీల్-గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది.

చివరగా, ‘కార్మేని సెల్వం’ ఒక హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. నా పేరు కంటే నా సంగీతమే ప్రేక్షకుల హృదయాల్లో నిలవాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు రామానుజన్ ఎంకే.

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #carmeni selvam
  • #Carmeni Selvam movie
  • #Carmeni Selvam music director
  • #ramanujan
  • #samudhrakhani

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

2 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

21 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

1 day ago
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

2 days ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version