మరో వివాదంలో చిక్కుకున్న మాధవీ లత…!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న వారి లిస్టులో సినీ నటి మాధవీ లత కూడా ఉంటుంది… అనడంలో సందేహం లేదు. కొంతకాలం సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి సరైన బ్రేక్ రాలేదు. ‘నచ్చావులే’ వంటి హిట్ సినిమా ఈ అమ్మడి ఖాతాలో ఉన్నప్పటికీ అది కలిసి రాలేదు. కొన్నాళ్ళ వరకూ ఖాళీగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు అటు తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఈమె బి.జె.పి పార్టీ తరుపున పోటీ చేసి ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా…అప్పుడప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపుతుంటాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడి పై కేసు నమోదవ్వడం పెద్ద కల కలం రేపిందనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. మాధవీ లత తన సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదుల కార్యకలాపాల విషయమై ఓ వర్గానికి వర్గానికి మద్దతు ఇస్తూ కామెంట్స్ చేసిందని… వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

దీంతో వారు ఐపీసీ సెక్షన్‌ 295ఏ కింద మాధవీ లత పై కేసు నమోదు చేశారని తెలుస్తుంది. ఈ కేసు పై దర్యాప్తు చేపట్టినట్టు కూడా ఏసీపీ హరినాథ్‌ చెప్పుకొచ్చారు. ఈ టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ విషయం పై మాధవీ లత ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus