Gangavva: చిక్కుల్లో పడ్డ గంగవ్వ.. కారణం అదే!

  • October 23, 2024 / 01:35 PM IST

ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ కమ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి గంగవ్వ (Gangavva) అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ అనారోగ్య సమస్యల కారణంగా షో నుండి అర్ధాంతరంగా తప్పుకుంది. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో,, వెబ్ సిరీస్..లలో కూడా నటించింది. అయితే సీజన్ 8 లో మళ్ళీ ఈమెకు ఛాన్స్ వచ్చింది.బిగ్ బాస్8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. మొదటి రోజే ఒక టాస్క్ ఆడి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది.

Gangavva

ఆ తర్వాత టాస్కుల్లో పెద్దగా ఆడకపోయినా.. కామిడీ చేస్తూ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వస్తోంది. అలాంటి గంగవ్వ (Gangavva) పై కేసు నమోదవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. గంగవ్వ ‘మై విలేజ్ షో’ అనే యూ ట్యూబ్ చానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఆమె చానెల్ కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ లేదా సినిమాల్లో ఈమెకి అవకాశాలు వస్తున్నాయి అంటే కారణం ఆమె ‘మై విలేజ్ షో’ చానెల్ అనే చెప్పాలి. అయితే 2022 మే నెలలో చేసిన ఒక షో వల్ల గంగవ్వ (Gangavva) పై కేసు నమోదు అయ్యింది.

అవును ఆ ఎపిసోడ్లో చిలుక పంచాంగం కోసం .. చిలుక ని పంజరంలో బంధించి ఉంచారట. దీంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ గంగవ్వ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

కోవిడ్ తర్వాత ప్లాప్స్ ఇచ్చిన 10 మంది సక్సెస్ఫుల్ దర్శకులు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus