నేచురల్ స్టార్ నాని, మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ నటించిన సినిమా ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలతో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 9న ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీంతో పవన్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించి మైత్రి మూవీస్, శ్రేయాస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి అనుమతి తీసుకోలేదని.. పవన్ కళ్యాణ్ లాంటి వీఐపీ గెస్ట్ గా వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వనందుకు సుమోటోగా కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. 188 సెక్షన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లో ఎక్కువ క్రౌడ్ ఉండడం వలన తోపులాటలు జరుగుతూ చాలా మంది గాయాలపాలవుతున్నారు.
అందుకే ఈ విషయంలో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటిది పవన్ గెస్ట్ గా వచ్చిన ఈవెంట్ గురించి కనీసం ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నిర్మాణ సంస్థపై కేసు నమోదు చేశారు. ఇక ‘అంటే సుందరానికీ’ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటిరోజు ఈ సినిమా రూ.3.87 కోట్ల షేర్ ను సాధించింది. రూ.6.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Most Recommended Video
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!