నటి తాప్సీ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు గత కొద్దిరోజులుగా ఈమె నటించిన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫోటోగ్రాఫర్లపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఈమె పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్నారు అయితే తాజాగా మరోసారి ఈమె వివాదంలో చిక్కుకున్నారని తెలుస్తోంది అయితే ఈసారి ఏకంగా ఈమె వ్యవహార శైలి పై పోలీసు కేసు నమోదు కూడా చేశారని తెలుస్తుంది. ఇలా తాప్సీ పై పోలీస్ కేసు నమోదు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
మార్చి 12వ తేదీ ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్ లో ఎరుపు రంగు డిజైనర్ డ్రెస్ ధరించి తాప్సి రాంప్ వాక్ చేశారు. ఇలా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఈ డ్రెస్సులో ఈమె ఏద అందాలను ఆరబోస్తూ క్లీవేజ్ షో చేశారు. అయితే ఈ ఫ్యాషన్ వీక్ లో భాగంగా ఈమె లక్ష్మీ హారం ధరించి ర్యాంప్ వాక్ లో పాల్గొన్నారు. అయితే ఈ విషయంపై కొందరు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈమె పై పోలీసు కేసు నమోదు చేశారు.
ఈ విషయమై బిజెపి ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ మార్చ్ 27న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదులో భాగంగా తాప్సి ఫ్యాషన్ వీక్ లో పాల్గొని రాంప్ వర్క్ చేస్తూ లక్ష్మి దేవి చిత్రం ఉన్న హారాన్ని ధరించి హిందూ మనోభావాలు దెబ్బతీశారు అంటూ ఈయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమె పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరి ఈ వివాదంపై తాప్సి (Taapsee) ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టిన తాప్సీ తెలుగులో పలు సినిమాలలో నటించారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఈమె పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనూ కమర్షియల్ సినిమాలలోను నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా నిర్మాణ సంస్థను కూడా స్థాపించి ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?