ఎట్టకేలకు సుశాంత్ రాజ్ పుత్ కుటుంబ సభ్యుల పోరాటం ఫలించింది. సుశాంత్ రాజ్ పుత్ కేసును సీబీఐ విచారణకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేడింది. దీనితో సుశాంత్ మరణం వెనుక నిజాలు నిగ్గు తేల్చడానికి సిబిఐ రంగంలోకి దిగనుంది. సుశాంత్ ఆత్మ హత్య వెనుక కుట్ర కోణం ఉందని, ఇది పక్కా మర్డర్ అని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బీహార్ లో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసుకూడా నమోదు కావడం జరిగింది.
ముంబైకి వచ్చిన బీహార్ పోలీసులు కొంత విచారణ జరిపారు. సుశాంత్ కేసు విషయంలో ముంబై పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీహార్ పోలీసులు సందేహాలు వ్యక్తం చేయడం జరిగింది. సుశాంత్ మరణం వెనుక బాలీవుడ్ పెద్దలు ఉన్నారనే అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో సిబిఐ ఎంట్రీతో ఈ కేసు కొత్త మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది. సిబిఐ ఎంట్రీ కొందరు బాలీవుడ్ పెద్దల వెన్నులో వణుకు పుట్టిస్తుందట.
ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సుశాంత్ మరణానికి కొందరు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియాను పోలీసులు మరియు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. త్వరలో ఆమెను సిబిఐ కూడా విచారణకు పిలవనుంది. గతంలో రియా సుశాంత్ కేసును సిబిఐకి అప్పగించాలని కొరుకుకోవడం విశేషం. మరి చూడాలి సిబిఐ ఎంట్రీతో ఎలాంటి విషయాలు బయటికి వస్తాయో.
Most Recommended Video
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?