రాజమౌళి గురించి తారలు ఏమి చెప్పారంటే ?

అపజయం ఎరుగని డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. మగధీర చిత్రంతో దర్శకధీరుడిగా పేరు దక్కించుకున్న ఈ జక్కన్న.. బాహుబలి చిత్రంతో టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అభిమాన డైరక్టర్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బడ్జెట్ నుంచి కలక్షన్ల వరకు బౌండరీలను తొలిగించిన రికార్డుల ఘనుడి గురించి స్టార్స్ ఏమన్నారంటే…!!

ఏ రోల్ చేయమన్నా ఓకే మహా భారతాన్ని రాజమౌళి తీస్తే అందులో ఏ రోల్ ఇచ్చినా ఆనందంగా చేస్తాను. ఎందుకంటే ప్రతి రోల్ ని పవర్ ఫుల్ గా చూపించడంలో రాజమోళి నేర్పరి. – ఎన్టీఆర్

అంతా శిల్పి చరణ్ అనే శిల్పాన్ని చెక్కింది మన అమర శిల్పి జక్కన్న రాజమౌళి. తనకి ఉన్న ట్యాలెంట్ మొత్తాన్ని మగధీర సినిమాలోనే చూపించారు. – చిరంజీవి

నంబర్ వన్ భారతదేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి ఎదుగుతారు. అతని దర్శకత్వంలో నటించే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. – రజనీకాంత్

సినీ ఋషినిరంతరం సినిమా గురించి తప్పించే ఋషి రాజమౌళి. అతని విజన్ ని ఎవరూ అంచనా వేయలేము. కథను నాకు చెప్పినా.. సెట్ దగ్గరకు పోయే సరికి ఆ సీన్ ని చిత్రీకరించే విధానం అద్భుతంగా ఉంటుంది. అలా యూనిట్ మొత్తాన్ని ప్రతి రోజూ ఆశ్చర్యానికి గురిచేయడం రాజమౌళికే సొంతం. – ప్రభాస్

అవకాశం మళ్ళీ రావాలి… నేను ఇప్పటికీ పశ్చాత్తాపపడే తప్పు తప్పు ఏదైనా ఉందంటే.. అది రాజమౌళి సార్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా వదులుకోవడం. అటువంటి గ్రేట్ డైరక్టర్ డైరక్షన్లో నటించే అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. – సూర్య

హద్దులు చెరిపిన ఘనుడు ఇప్పుడున్న స్టార్ డైరక్టర్లో రాజమౌళి గారు స్పెషల్. ఒక్క బాహుబలి అని మాత్రమే కాదు మర్యాద రామన్న, ఈగ .. ఎటువంటి సబ్జెక్టు తీసుకున్నా.. కలక్షన్ల పరంగా హద్దులు చెరిపేస్తుంటారు. – అక్కినేని నాగార్జున

గర్వపడుతున్నా.. మగధీర సినిమా తర్వాత ఒక తెలుగు వాడిగా, భారతీయుడిగా రాజమౌళిని చూసి గర్వపడుతున్నా.
– పవన్ కళ్యాణ్

వీరాభిమాని అయ్యాను మగధీర సినిమాని చూసిన తర్వాత రాజమౌళి కి నేను అభిమాని అయ్యా. ఈగ చూసిన తర్వాత వీరాభినయ్యాను. – శంకర్

అటువంటి డైరక్టర్ లేరు బాహుబలి వంటి చిత్రాలను బాలీవుడ్ లో తీయలేము. ఎందుకంటే రాజమౌళి వంటి డైరక్టర్ ఇక్కడ లేరు.
– కరణ్ జోహార్

అద్భుతమైన డైరక్టర్ రాజమౌళి లో చాలా ట్యాలెంట్ ఉంది. అవకాశం వస్తే అతని దర్శకత్వంలో నటిస్తా. – అమీర్ ఖాన్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus