చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సినీ ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. ఈరోజు 63వ పుట్టినరోజును జరుపుకుంటున్న చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా అన్నయ్యని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఇలా అనేకమంది స్వయంగా కలిసి విషెష్ చెబుతుండగా.. మరికొంతమంది ట్విట్టర్ వేదికపై శుభాకాంక్షలు చెప్పారు.

మిత్రునికి విషెష్
ప్రియమైన చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. – నాగార్జున

శుభాకాంక్షలు
నా స్నేహితుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. – వెంకటేష్

మీరొక రాక్ స్టార్
నా ప్రియ మిత్రుడు, సహనటుడు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరొక రాక్ స్టార్. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. – రాధిక

అందరివాడు
మా అందరివాడు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. – రోజా

ఏకైక మెగాస్టార్
ఏకైక మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. – అల్లు అర్జున్

ప్రత్యేకమైన రోజు
హ్యాపీ బర్త్ డే అన్నయ్యా. మీకు ఎంతో ప్రత్యేకమైన ఈరోజు సుఖ సంతోషాలతో నిండిపోవాలి. – శ్రీకాంత్

స్ఫూర్తిగా ఉండాలి
మా మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే అందరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి.
– కొరటాల శివ

లవ్యూ సార్..
మెగాస్టార్ కు హ్యాపీ బర్త్ డే. ఎన్నో మంచి సినిమాలు అందిస్తూ, మాలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ, మాకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేస్తున్నారు. లవ్యూ సార్. – హరీష్ శంకర్

యంగ్ బ్రదర్..
ఈ రోజుతో మెగాస్టార్ వయసు మరో సంవత్సరం తగ్గింది. మా యంగ్ బ్రదర్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. – సుధీర్ బాబు

స్ఫూర్తిదాత
నా స్ఫూర్తిదాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. – వరుణ్ తేజ్

లవ్యూ మామా
హ్యాపీ బర్త్ డే మెగాస్టార్. మీరు మాకు పంచిన ప్రేమ, స్ఫూర్తి ఎంతో గొప్పవి. లవ్యూ మామా.- సాయి ధరమ్

గొప్పగా ఉండాలి సార్
మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు ఇంకా గొప్పగా ఉండాలి సార్. – శ్రీను వైట్ల

స్ఫూర్తిదాయకం…
మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రయాణం మాకెంతో స్ఫూర్తిదాయకం. – వంశీ పైడిపల్లి

మెగాస్టార్ కి శుభాకాంక్షలు చెప్పిన సినీ ప్రముఖుల్లో కొంతమంది ట్వీట్స్ మాత్రమే ఇవ్వగలిగాము.. ఇంకా అనేకమంది బర్త్ డే విషెష్ తో సోషల్ మీడియా నిండిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus