సెన్సార్ సభ్యుల మనసు దోచుకున్న ‘ఒక మనసు’

నాగ శౌర్య, నిహారిక కొణిదెల జంటగా, రామరాజు దర్శకత్వంలో, TV 9 సమర్పణలో, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏ కట్స్ లేకుండా సెన్సార్ సభ్యుల నుంచి ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది. మనసుకు హత్తుకునే ప్రేమ కధలు పర భాషా చిత్రాల్లో ఎక్కువగా వస్తున్నాయని, కాని మన తెలుగు సినిమాల్లోని ప్రేమ కధల్లో ఆ స్వచ్ఛత కనుమరుగవుతుందన్న విమర్శకు ఒక మనసు చిత్రం సమాధానంగా నిలుస్తుందని, ప్రస్తుత రాజకీయాల నేపధ్యంలో వస్తున్న ఈ ప్రేమ కధ యువత మనసును హత్తుకుంటుందని సెన్సార్ సభ్యులు అభినందించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు ఘన విజయం సాధించగా, సినిమా ఈ నెల 24 వ తేదిన విడుదలకు ముస్తాబవుతోందని, నాగ శౌర్య, నిహారిక నటనకు తప్పకుండా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుతాయని, ఒక మంచి ప్రేమ కధగా ఈ చిత్రం అందరి మన్ననలు పొందుతుందని దర్శకుడు రామరాజు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus