కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించిన తాజా చిత్రం ‘చావు బ్రతుకు చల్లగా’. నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కాబోతుంది. బస్తీ బాల‌రాజు అనే పాత్రలో కార్తికేయ కనిపించబోతున్నాడు.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజ‌ర్ గ్లిమ్ప్స్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది.జేక్స్‌ బిజాయ్ సంగీతంలో రూపొందిన మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని.. వంటి పాటలకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. అనసూయ స్పెషల్ సాంగ్ ప్రోమో కూడా సినిమా పై మంచి అంచనాలు పెరిగేలా చేసిందని చెప్పొచ్చు.

కాబట్టి ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగానే జరిగింది. వాటి వివరాలను పరిశీలిస్తే :

నైజాం  4.20 cr
సీడెడ్  2.00 cr
ఉత్తరాంధ్ర  6.00 cr
ఏపీ+తెలంగాణ (టోటల్) 12.20 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా + ఓవర్సీస్  0.80 cr
వరల్డ్ వైడ్ టోటల్ 13.00 cr

‘చావు కబురు చల్లగా’ చిత్రానికి 13.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 13.7కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా మరో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటితో పాటు ‘జాతి రత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ హవా కూడా నడుస్తుంది. మరి వాటిని తట్టుకుని ఈ చిత్రం ఎలా నిలబడుతుందో చూడాలి.!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus