సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘ఛాంపియన్’(Champion) రూపొందింది. ఇది అతనికి హీరోగా రెండో సినిమా. మొదటి సినిమా ‘పెళ్ళిసందD’ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో కొంచెం ఆచి తూచి రెండో సినిమాగా ‘ఛాంపియన్’ ని ఎంపిక చేసుకున్నాడు. ఇదొక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా. ఒక ఫుట్ బాల్ ప్లేయర్ గా రోషన్, ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ అనశ్వర రాజన్ ట్రైలర్లో కనిపించారు.
అలాగే బైరాన్‌పల్లి ఊచకోతని మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నట్టు కొన్ని విజువల్స్ హింట్ ఇచ్చాయి. 1948 ఆగస్టు 27న జరిగిన ఓ దారుణ కథని సినిమాలో చూపించబోతున్నారు అని అంతా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని కొంతమంది సినీ పెద్దలు వీక్షించడం జరిగింది. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.వారి టాక్ ప్రకారం.. ‘ఛాంపియన్’ మూవీ మొదటి 15 నిమిషాల్లో 1948 టైంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘంటనలను ఫిక్షన్ జోడించి చూపించారట.
అక్కడ విజువల్స్ అదిరిపోయాయి అని అంటున్నారు. అలాగే రోషన్ ఎంట్రీ సీన్, తర్వాత వచ్చే హీరోయిన్ ట్రాక్, లవ్ స్టోరీ అన్నీ టైం పాస్ చేయించే విధంగానే ఉన్నాయట. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ పెద్ద సినిమాలను గుర్తుచేస్తుందట. అక్కడ వచ్చే విజువల్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. ‘గిర్రా గిర్రా’ పాటని కూడా బాగా పిక్చరైజ్ చేసినట్టు చెబుతున్నారు.
సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ బాగున్నాయట. క్లైమాక్స్ కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుంది అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.