రీమేక్‌లు మార్పులు చేస్తారట… ఒరిజినల్‌ ఫ్లేవర్‌ పోతుందేమో!

  • August 5, 2023 / 01:27 PM IST

ఏంటీ… ‘బ్రో’ సినిమాలో మార్పులా? సినిమా వచ్చేసింది, దాదాపు రన్‌ కూడా చివరి దశకొచ్చింది కదా. ఇప్పుడు మార్పులు ఏంటి అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. అయితే ఇది తమ్ముడు చేసిన ‘బ్రో’ కాదు.. అన్నయ్య చేసే ‘బ్రో’ గురించి. మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా ‘బ్రో డాడీ’ సినిమాను చిరంజీవి ప్రధాన పాత్రలో తెలుగులో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభం అవుతుంది అని కూడా అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం అంటే.. ఆ మధ్య చిరంజీవి విదేశాలకు వెళ్తూ వేసిన ట్వీటే. మిగిలినవన్నీ అనధికారిక సమాచారాలు, లీకులే. అయితే తాజాగా వస్తున్న ఓ లీక్‌ చాలా ఆసక్తికరంగా వినిపిస్తోంది. అదే ఈ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో కీలకమైన మార్పును చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘బ్రో డాడీ’లో డాడీ ఉండదు అంటున్నారు. అంటే.. ఈ సినిమాలో మెయిన్‌ పాయింట్‌నే మార్చేస్తున్నారు అని సమాచారం.

మలయాళ ‘బ్రో డాడీ’ సినిమా చూస్తే.. అందులో మోహన్‌ లాల్‌ తనయుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించాడు. తండ్రీ కొడుకులు అన్నదమ్ముల్లా ఉంటే ఎలా ఉంటుంది అనేది సినిమా మెయిన్‌ పాయింట్‌. అయితే ఇక్కడకు అంటే తెలుగులోకి వచ్చేసరికి ఆ పాయింట్‌ లేకుండా అన్నదమ్ముల్లా చూపిస్తారు అని సమాచారం. చిరంజీవికి, తమ్ముడి పాత్రకు మధ్య ఈ కథ అంతా నడుస్తుంది అన్నమాట. దీంతో అసలు విషయం పక్కకు తప్పిస్తే సినిమా ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది.

ఇక ఈ సినిమాలో యంగ్‌ హీరో పాత్ర కోసం తొలుత సిద్ధు జొన్నలగడ్డను అనుకున్నారు. అంతా ఓకే అనుకున్న సమయంలో ఆయన వెనక్కి వెళ్లాడు అని టాక్‌. దీంతో ఆ పాత్ర కోసం కార్తికేయ పేరు పరిశీలనకు వచ్చింది. ఇప్పుడు తాజాగా శర్వానంద్‌ పేరు వినిపిస్తోంది. దీంతో సినిమా ఓపెనింగ్‌ టైమ్‌కి ఆ యంగ్‌ హీరో ఎవరు అనేది తేలుతుందా లేదా అనే చర్చ నడుస్తోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus