చిరంజీవిని ఇబ్బంది పెడుతున్న చరణ్

రామ్ చరణ్ చేసే పనులు చిరంజీవికి తెగ ఇబ్బంది పెడుతున్నాయంట. ఎంత చెప్పిన తండ్రి మాట కొడుకు వినడం లేదు. ఇది గాసిప్ కాదు.. ఈ విషయాన్నీ స్వయంగా చెర్రీ చెప్పారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ” నన్ను, నా భార్య ఉపాసనను ఇంట్లో నుంచి నాన్నగారు వెళ్లిపొమ్మన్నారు. ఇది సీరియస్ వార్నింగ్ కాదు.. స్వీట్ వార్నింగ్” అని వివరించారు. అసలు తండ్రి కోపానికి కారణం వివరిస్తూ.. “ఉపాసనకు మూగజీవాలు అంటే చాలా ఇష్టం. ఆమె తో పాటు నాకు కూడా వాటితో ఆడుకోవడం అలవాటు అయింది. దీంతో ఇంట్లో మనుషుల కంటే జంతువులు ఎక్కువైపోతున్నాయి. ఇదే డాడీకి కోపం తెప్పిస్తోంది” అని చెప్పారు. “ఉపాసన చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలా జంతువుల్ని చూసుకుంటుంది.

అమల నడిపే ‘బ్లూ క్రా’స్ క్లబ్బులో జంతువులు ఎక్కువైతే తమ ఇంటికే పంపుతారు. అలాగే జూలో జంతువుల్ని సరిగా చూడటంలేదని తెలిసి అధికారులు కొన్నింటిని తమ ఇంటికి కొన్ని జంతువుల్ని పంపారు. అందులో ఒక ఒంటె కూడా ఉంది” అని చరణ్ తెలిపారు. ఇలా ఇంట్లో బాగాజంతువులు పెరిగిపోవడంతో వాటికోసమే ప్రత్యేకంగా ఒక ఫామ్ హౌస్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చరణ్ వివరించారు. తన ఇంట్లో గుర్రాలు చాలా ఉన్నాయని అందులో బ్రాట్ బ్రిట్నీ అనే గుర్రాలంటే తనకెంతో ఇష్టమని వాటికి పిల్లలు కూడా పుట్టాయని చరణ్ సంతోషంతో చెప్పారు. అంతేకాదు తమ పెళ్లిరోజున ఉపాసన కు వేరే పెళ్లిరోజు బహుమతులు కాకుండా జంతువుల్నే గిఫ్టుగా ఇస్తున్నానన్నారు. మరి డాడీ కోపాన్ని చరణ్ ఎలా తగ్గిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus