ఛార్మి ‘జనగణమన’ విశేషాలు!

  • April 6, 2016 / 09:40 AM IST

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘జ్యోతి లక్ష్మి’ సినిమాలో నటించిన ఛార్మి కు ఆ తరువాత తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇంతకముందు ఒకటో, అరో ఐటెం సాంగ్ లలో అయినా కనిపించేది.. ఇప్పుడు అది కూడా లేదు. అయితే తనే స్వయంగా ఓ సినిమాను నిర్మించి.. అందులో లీడ్ రోల్ లో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘జనగణమన’ అనే టైటిల్ తో దేశభక్తి నేపధ్యంలో ఉండే చిత్రాన్ని ఛార్మి నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదివరకు కృష్ణవంశీ ఇదే టైటిల్ తో సినిమా చేయడానికి ప్రయత్నించాడు కానీ వర్కవుట్ కాలేదు. మరి ఛార్మి ‘జనగణమన’ సంగతి ఏమవుతుందో.. చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus