సమంత పై ఛార్మీ కామెంట్స్..!

  • July 6, 2019 / 02:52 PM IST

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఓ బేబీ’. నిన్న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నందినీ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం.. ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ చిత్రానికి అనువాదంగా రూపొందింది. వయసు మళ్ళిన ఓ వృద్ధురాలు మళ్ళీ పాతికేళ్ళ వయసుకు వస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో సినిమా రూపొందింది. వయసు మళ్ళిన వృద్ధురాలు పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ నటించగా.. పాతికేళ్ళ యుక్తవయసు పాత్ర సమంత పోషించింది. ఆద్యంతం ఎంజాయ్ చేసేవిధంగానే ఉంది. ఇప్పటివరకూ సమంత కెరీర్ లో ఇదే బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో తన నటనకి.. అలాగే దక్కిన విజయానికి సమంత పై పలువురు సినీ సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఛార్మీ కూడా ఉంది.

ఛార్మీ తన సోషల్ మీడియా ద్వారా సమంత గురించి మాట్లాడుతూ.. “‘ఏ టైం కి పుట్టావ్ అమ్మ నువ్వు..? నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్ అండ్ నీ జాతకంకి నమస్కారం” అంటూ ట్వీట్ చేసింది. ‘ఓ బేబీ రాక్స్’ ‘సమంత రాక్స్’ అంటూ హ్యాష్ ట్యాగ్ లు కూడా పెట్టింది. ఇది చూసిన సమంత ధన్యవాదాలు తెలుపుతూ.. నీకు నా తరుపున చాలా హుగ్గులు.. ముద్దులు… అంటూ రిప్లై ఇచ్చింది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus