విడుదలకు ముందే సేఫ్ జోన్ లో చిలసౌ

  • July 30, 2018 / 01:54 PM IST

స్టార్ హీరోహీరోయిన్లు నటించిన సినిమాలు కూడా విడుదలకు ముందు రోజు వరకూ సదరు చిత్ర దర్శకనిర్మాతలకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తాయి. కానీ.. మినిమం మార్కెట్ రేంజ్ లోని సుశాంత్ హీరోగా, హీరోగా వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతూ దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ హీరోగా, రుహానీ శర్మ అనే ముంబై భామను కథానాయికగా పెట్టి కొత్త నిర్మాణ సంస్థ సిరుని ప్రొడక్షన్స్ నిర్మించిన “చిలసౌ” మాత్రం విడుదలకి వారం ముందే నిర్మాతలను సేఫ్ జోన్ లో కూర్చోబెట్టింది.

ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ విడుదల అనంతరం మంచి ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. దాంతో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని కొనడం విశేషం. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్రెడీ బడ్జెట్ ను కవర్ చేసింది. ఇక కలెక్షన్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ బోనస్ అన్నమాట. సొ, నాలుగు తెలుగు సినిమాలు విడుదలవుతున్న ఈ వారంలో “చిలసౌ” సేఫ్ ప్రొజెక్ట్ అన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus