Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

తెలుగు సినిమా – నవలలు.. ఈ కాంబినేషన్‌ ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ బంధం కొనసాగుతోంది. ఇలా వచ్చిన సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. అందుకే అప్పట్లో ఓ నవల.. సినిమాగా మారుతోంది అని అంటే థియేటర్ల దగ్గర జన జాతర జరిగేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రీసెంట్‌గా సినిమాగా మారిన సినిమాకు సరైన ఫలితం కూడా రాలేదు. అందుకేనేమో ఇప్పుడు దర్శకులు నవలలను సినిమాగా మలచడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే కొంతమంది మాత్రం వెబ్‌ సిరీస్‌లుగా చేయడానికి రెడీ అవుతున్నారు.

Chillara Devullu

అలా దాశ‌ర‌థి రంగాచార్య రాసిన ‘చిల్ల‌ర దేవుళ్లు’ న‌వ‌ల‌ను ఇప్పుడు తెరకెక్కిస్తారని టాక్‌. 1970లో కేంద్ర సాహిత్య అకాడ‌మి పుర‌స్కారం అందుకున్న ఈ నవలలె అప్ప‌టి తెలంగాణ జీవ‌న చిత్రాన్ని ఆవిష్కంచారు. తెలంగాణ సాహిత్యం గురించి అధ్య‌యనం చేయాల‌నుకునేవారికి ఈ నవల కచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. అలాంటి ఈ న‌వ‌ల‌ రైట్స్ కోసం ఓ నిర్మాత రెడీ అవుతున్నారు. దీన్ని ప్రముఖ దర్శకుడే తెరకెక్కిస్తారని టాక్‌. అయితే సినిమాగానా, వెబ్‌సిరీస్‌గానా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

రీసెంట్‌ టైమ్‌లో సినిమా వచ్చిన నవల అంటే ‘కొండపొలం’. వైష్ణవ్‌ తేజ్‌ – రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కాంబినేషన్‌లో క్రిష్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో మరో దర్శకుడు ఈ ఆలోచన చేయలేదు. అయితే గుర‌జాడ విరచిత ‘కన్యాశుల్కం’ న‌వలను ఇటీవల వెబ్‌సిరీస్‌గా తీశారు. ఇందులో స్టార్‌ నటులే ఉన్నారు.

అయితే షూటింగ్‌ ఎప్పుడో అయిపోయినా ఇంకా మార్పులు, చేర్పులు, కూర్పులు కుదరక రిలీజ్‌ చేయడం లేదని టాక్‌. త్వరలోనే స్ట్రీమింగ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తారని టాక్‌. ఇదిలా ఉండగా చలం ‘మైదానం’ కూడా వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఈ నవలలను సరైన ఫలితం అందుకే మరికొన్ని నవలలను ఇలా మారే అవకాశం ఉంది.

‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus