కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ లలో చిన్మయి ఒకరు కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో విషయంలో చిన్మయి ఫైర్ అయ్యారు. గతంలో మీటూ ఉద్యమానికి చిన్మయి భారీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించి చిన్మయి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రష్మిక ఇన్ స్టాగ్రామ్ స్టోరీ చూశానని ఈ వీడియో వల్ల రష్మిక నిజంగా కలవరపడుతున్నట్టు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ మహిళల శరీరాలు దోపిడీకి గురవుతున్నాయని చిన్మయి అన్నారు.
మన దేశంలోని అమ్మాయిలను వేధించడానికి డీప్ ఫేక్ ఒక ఆయుధంగా మారుతోందని ఆమె పేర్కొన్నారు. మహిళలను భయపెట్టడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి లైంగికంగా దాడి చేయడానికి డీప్ ఫేక్స్ తీవ్రమైన ఆయుధంగా మారుతోందని చిన్మయి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఏఐ, డీప్ ఫేక్ వల్ల చిన్న గ్రామాలు, పట్టణాలలోని కుటుంబాల పరిస్థితి ఏంటని చిన్మయి ప్రశ్నించారు. ఏఐ మాయ అంటూ సిమ్రాన్ షేర్ చేసిన ఒక వీడియో గురించి సైతం చిన్మయి కామెంట్లు చేయడం గమనార్హం.
డీప్ ఫేక్ ల ప్రమాదం, సైబర్ నేరాల గురించి ఫిర్యాదు చేసేలా దేశవ్యాప్త ప్రచారాన్ని తక్షణమే మొదలుపెట్టాల్సిన అవసరం ఉందని చిన్మయి కామెంట్లు చేయడం గమనార్హం. మార్ఫింగ్ ఫోటోలతో మహిళా రుణ గ్రహీతలను వేధిస్తున్న లోన్ యాప్స్ గురించి సైతం చిన్మయి ప్రస్తావించారు. చిన్మయిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. చిన్మయి కామెంట్లకు నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు.
చిన్మయి (Chinmayi) రాబోయే రోజుల్లో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. చిన్మయి రెమ్యునరేషన్ మాత్రం పరిమితంగానే ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చిన్మయి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. చిన్మయి పోస్ట్ కు 1500కు పైగా లైక్స్ వచ్చాయి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!