‘చిన్నారి పెళ్లికూతురు’ ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన నటి సురేఖా సిక్రీ ఈరోజు అనగా శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ లో కళ్యాణి దేవి పాత్రని ఈమె పోషించిన సంగతి తెలిసిందే.ఈ సీరియల్ లో ఆమె కొంచెం కోపిష్టిలా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సీరియల్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సురేఖా వయస్సు 75 సంవత్సరాలు. ఆమె మరణించినట్టు కుటుంబ సభ్యులే మీడియాకి తెలియజేసారు.
కొంతకాలంగా ఈమె అనారోగ్యంతో బాధపడుతూ వస్తుంది.కుటుంబసభ్యులు ఈమెకు చికిత్సని అందిస్తున్నారు. 2018 వ సంవత్సరంలో ఈమెకు పక్షవాతం అలాగే 2020 లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చిందని వారు చెప్పుకొచ్చారు. 1945 వ సంవత్సరం ఏప్రిల్ 19న సురేఖా సిక్రీ జన్మించారు.1978 వ సంవత్సరంలో వచ్చిన ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో ఈమె నటనా జీవితాన్ని ప్రారంభించారు. అటు తర్వాత తమాస్ (1988), మమ్మో (1995) మరియు బధాయ్ హో (2018) చిత్రాల్లో నటించారు.
ముఖ్యంగా ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన ‘బదాయ్ హో’ చిత్రంలో ఈమె నటన అద్భుతమనే చెప్పాలి. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంలో ఈమె పాత్ర కూడా ఉందని చెప్పాలి. ఇక మూడుసార్లు నేషనల్ అవార్డుల్ని, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న నటిగా కూడా ఈమె అప్పట్లో రికార్డు సృష్టించారు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్