ఇబ్బందుల్లో “చిరు – బాలయ్య”…!

  • March 12, 2016 / 01:04 PM IST

నందమూరి బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళిద్దరూ సినీ పరిశ్రమలో టాప్ హీరోలుగా చక్రం తిప్పారు. అయితే వీరిలో చిరు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ తీర్థం పుచ్చుకోగా, బాలయ్య అటు రాజకీయంగా, ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరి సినిమా అంటేనే వారి అభిమానులకు పండుగ. ఇక చిరు 150వ సినిమా కోసం, బాలయ్య 100వ సినిమా కోసం లక్ష కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ హీరోల వ్యవహారం ఒకింత బాధించ దగిన విషయం. ఎందుకంటే పరిస్థితులు అలా తయారయ్యాయి.
 చిరు సంగతే తీసుకుంటే ఆయన 150వ చిత్రం చేస్తున్నాడు అంటూ అప్పుడెప్పుడో రెండు ఏళ్ల క్రితం వార్త వచ్చింది మొదలు ఇప్పటికీ ఆ చిత్రంపై కనీస క్ల్యారిటీ రాలేదు. కమర్షియల్ సినిమా అంటూ కొందరు, కాదు కాదు, పేట్రియాటిక్ సినిమా అంటూ మరికొందరు, రాజకీయ కుళ్ళును కడిగేసె కధ అంటూ ఇంకొందరు, ఇలా కధల విషయం ఒక వైపు, మరో వైపు, డిఫరెంట్ దర్శకుడు వర్మతో అని ఒకడు, కాదు కాదు మెగా ఫ్యామిలీ నమ్మిన బంటు పూరీ అంటూ మరొకడు, అబ్బే  వినాయక్ తోనే అని ఇంకొకడు ఇలా ఎవడికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకోవడమే కానీ ఇప్పటికీ ఆ చిత్రం విషయంలో 1% క్లారిటీ కూడా లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే 149సినిమాలు తీసిన హీరో చిరుకు ఒకింత ఇబ్బందికర పరిణామం అనే చెప్పాలి. ఇక మరో పక్క మన బాలయ్య సంగతి తీసుకుంటే 99వ చిత్రం డిక్టేటర్ భారీ హిట్ కొట్టడంతో మంచి ఊపుమీద ఉన్న బాలయ్య 100వ చిత్రం చరిత్రలో నిలిచిపోవాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ, ఆ చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తాడు అని అందరూ ఊహించారు. అయితే అనుకోని విధంగా ఆ చిత్రాన్ని సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో “ఆదిత్య999” టైటిల్ లో చేయనున్నట్లు మీడియా కోడై కూసింది. మరో పక్క కాదు ఈ చిత్రం పేరు “రామా రావు గారు” దర్శకుడు అనిల్ రవిపూడి, నిర్మాత దిల్ రాజు అంటూ కొందరు న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇవేమీ కాదు 100వ చిత్రం పై బోయపాటి ఇప్పటికే కధ సిద్దం చేసాడని, ఆ సినిమా పేరు “గాడ్ ఫాదర్” అంటూ మరో కొందరు ఎవరికి నచ్చినట్లు వారు చెప్పుకుంటూ పోతున్నారు. అసలైతే ఇప్పటి వరకూ మన బాలయ్యకు కూడా తన 100వ చిత్రం పై ఏమాత్రం క్లారిటీ లేదు. 
20నుంచి 30ఏళ్ళపాటు ఇండస్ట్రీని శాసించిన ఈ ఇద్దరి హీరోల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus